![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -335 లో......ప్రమీల గురించి జయ తప్పుగా మాట్లాడడంతో తనపై శకుంతల కోప్పడుతుంది. అసలు ఈ విషయం విశ్వ సర్ కి చెప్పాలని జయని గంగ తీసుకొని వెళ్తుంటే వీరు వచ్చి ఆపుతాడు. గొడవ ఇంకా పెద్దది చెయ్యాలని చూస్తున్నావ్ ఈ విషయం కనుక బాబాయ్ కి తెలిస్తే కావాలనే గొడవ చేస్తున్నారని అనుకుంటారని వీరు అంటాడు.
ఆ తర్వాత జయని ఇషిక, వీరు పక్కకి తీసుకొని వెళ్లి మాట్లాడుతారు. అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి ఎంగేజ్మెంట్ జరగనివ్వు.. అసలు ప్రమీలని అనాల్సిన అవసరం ఏంటని వీరు కోప్పడతాడు. ఏంటి అంతా మీరు చెప్పినట్లే చేస్తున్నా కదా ఇంకెందుకు ఈ గొడవ అని జయ అంటుంది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయితే ప్రపంచానికి విశ్వనాథ్ కూతురు విజయంద్రప్రతాప్ మేనకోడలు అని తెలుస్తుంది. మూడుతరాలు తిన్నా తరగని ఆస్తులు మన సొంతం అవుతాయని వీరు అనగానే సరే అని జయ అంటుంది. అప్పుడే స్నేహ వచ్చి జయ నిన్ను అత్తయ్య రమ్మంటుందని తీసుకొని వెళ్తుంది.
ఆ తర్వాత విశ్వ, పెద్దసారు, రాఘవ మాట్లాడుకుంటారు. సూర్య ఏం చేస్తాడని విశ్వ అడుగుతాడు. ఇప్పుడే బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చాడని రాఘవ చెప్తాడు. పెద్దసారు రుద్ర గురించి గొప్పగా చెప్తుంటే వీరు విని మనం క్రెడిట్ కొట్టేయాలనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్లి మేం వారసులం కాబట్టి అంతా మేమే చూసుకోవాలని వీరు అంటాడు. నువ్వు ఈ ఇంటికి అల్లుడివి వారసుడివి కాదు.. వారసులు అంటే రుద్ర, సూర్య, వంశీ అని విశ్వ అంటాడు. వీడు ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియదు అనవసరంగా పరువు పోగొట్టుకున్నా అని వీరు అనుకుంటాడు. అప్పుడే రుద్ర వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |